ప్రయాణికుల పెరుగుతున్న రద్దీ దృష్ట్యా, దక్షిణ మధ్య రైల్వే 48 ప్రత్యేక రైళ్లను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. జులై 9 నుంచి సెప్టెంబర్ 25 వరకు ఈ రైళ్లు నడవనున్నాయి. తిరుపతి–హిసార్ మధ్య బుధ, ఆదివారాల్లో 12 రైళ్లు, కాచిగూడ–తిరుపతి మధ్య గురు, శుక్రవారాల్లో 8 రైళ్లు, నరసాపూర్–తిరువణ్ణమలై మధ్య బుధ, గురువారాల్లో 16 ప్రత్యేక రైళ్లు నడుస్తాయి. వీటికి ముందస్తు రిజర్వేషన్ సదుపాయం ఉందని, పూర్తి వివరాలు రైల్వే వెబ్‌సైట్‌లో పొందుపరిచినట్లు అధికారులు తెలిపారు.