AP: కూటమి ప్రభుత్వం విద్యార్థుల కోసం శుభవార్త అందించింది. ప్రభుత్వ పాఠశాలలకు దూర ప్రాంతాల నుండి వచ్చే విద్యార్థులకు రవాణా భత్యం చెల్లించాలని నిర్ణయించింది. 1వ నుండి 8వ తరగతి విద్యార్థుల వరకూ నెలకు రూ. 600 చొప్పున, మూడు నెలలకు ఒకసారి రూ. 1800 అందజేయనుంది. గతంలో ఏడాదికి ఒక్కసారి అందించేవారు. అయితే ఈ విధానంపై ఫిర్యాదులు రావటంతో ప్రస్తుతం 3 నెలలకు ఒకసారి రవాణా భత్యం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.