తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. బుధవారం నుంచి 2025-26 విద్యా సంవత్సరం పునఃప్రారంభం కావడంతో బీసీ సంక్షేమ శాఖ అధికారులతో మంత్రి పొన్నం ప్రభాకర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ.. ఈ విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులకు వారి కాస్మోటిక్ చార్జీలు నేరుగా వారి బ్యాంక్ అకౌంట్ లో జమ అయ్యేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. ఇందుకు సంబంధించి విద్యార్థులందరికీ బ్యాంక్ అకౌంట్ ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పారు.