టీ, కాఫీ తాగే వారిలో ఇతరుల కంటే క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువని అమెరికన్ క్యాన్సర్ సొసైటీ తెలిపింది. రోజుకు 4 కప్పుల టీ తాగే వారిలో 17 శాతం క్యాన్సర్ కారకాలు తగ్గాయని పేర్కొంది. నోటి క్యాన్సర్ లక్షణాలు 30 శాతం, గొంతు క్యాన్సర్ కారకాలు 22 శాతం తక్కువైనట్లు వెల్లడించింది. రోజుకు ఒక్క కప్పు టీ తాగే వారిలో 9 శాతం మెడ, తల క్యాన్సర్ కారకాలు తక్కువగా ఉన్నట్లు పేర్కొంది.