తెలంగాణ రాష్ట్రంలో రైతులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పబోతుంది. పెండింగ్‌లో ఉన్న రైతు భరోసా సాయాన్ని విడుదల చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు మూడున్నర ఎకరాల వరకు భూమి కలిగిన రైతులకు మాత్రమే పెట్టుబడి సాయం అందింది. కాగా, ఈ నెల 23 తర్వాత నాలుగు ఎకరాలు లేదా అంతకంటే ఎక్కువ భూమి ఉన్న రైతుల ఖాతాల్లోనూ ప్రభుత్వం డబ్బులు జమ చేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.