AP: పంచ గ్రామాల ప్రజలకు సీఎం చంద్రబాబు గుడ్ న్యూస్ చెప్పారని ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. సింహాచలం ఆలయానికి అడివివరం, వెంకటాపురం, చీమలాపల్లి, పురుషోత్తపురం, వేపగుంట గ్రామాల పరిధిలో 11,282 ఎకరాల భూమి చాలా రోజులుగా వివాదంలో ఉంది. అయితే దీనిపై త్వరలోనే సింహాచలంలో సమావేశాన్ని ఏర్పాటు చేసి పట్టాలు పంపిణీ చేస్తామని చంద్రబాబు తనతో చెప్పినట్లు ఎమ్మెల్యే తెలిపారు.