తెలంగాణలో 2026-27 ఆర్థిక సంవత్సరం నుంచి విద్యుత్ ఉద్యోగులకు డిస్కమ్ లు భారీగా జీతాలు పెంచనున్నాయి. 20 శాతం ఫిట్మెంట్ అమలు చేస్తామని ప్రకటించాయి. 2022లో వేతన సవరణ జరగ్గా 7శాతం ఫిట్మెంట్ ఇచ్చాయి. గత పదేళ్లలో 3సార్లు వేతన సవరణ జరగ్గా వేతనాలు 180 శాతానికి పైగా పెరిగినట్లు సమాచారం. ఉద్యోగుల జీతాలు, పెన్షన్ల ఖర్చు ఏటా 7శాతం పెరుగుతుండటంపై ఈఆర్సీ వివరణ కోరగా, డిస్కంలు ఈ మేరకు ప్రకటించాయి.