వివో V50 ఫోన్ ఫిబ్రవరి 17న మధ్యాహ్నం 12 గంటలకు భారత మార్కెట్లో లాంచ్ అవుతుందని కంపెనీ ఎక్స్ పోస్ట్‌లో ధృవీకరించింది. ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ అధికారికంగా వివో ఇండియా ఇ-స్టోర్‌తో పాటు ఆన్‌లైన్‌లో ఫోన్‌ను విక్రయిస్తాయి. అధికారిక టీజర్‌లు ఈ ఫోన్‌ను రోజ్ రెడ్, స్టార్రి బ్లూ, టైటానియం గ్రే కలర్ ఆప్షన్‌లలో అందిస్తున్నట్లు నిర్ధారించాయి. 6,000mAh బ్యాటరీతో ఈ కేటగిరీలో అత్యంత సన్నని స్మార్ట్‌ఫోన్‌గా కంపెనీ పేర్కొంది.