పట్టాలు తప్పి ఇళ్లపైకి దూసుకెళ్లిన గూడ్స్ రైలు (వీడియో)

60చూసినవారు
ఓ గూడ్స్ రైలు అదుపుతప్పి ఇళ్లలోకి దూసుకెళ్లింది. బుధవారం ఒడిశాలోని రూర్కేలాలో ఈ ప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా పట్టాలు తప్పిన రైలు జనావాసాలపైకి దూసుకెళ్లి ఇళ్లు, వాహనాలను ఢీకొట్టింది. మూడు బోగీలు పట్టాలు తప్పడంతో రైల్వే ట్రాక్ చుట్టుపక్కల ఉన్న ఇళ్ల గోడలు, రోడ్లపై నిలిపిన వాహనాలు ధ్వంసమయ్యాయి. ఓ స్కూల్ పిల్లల ఆటోను ట్రైన్ బోగీలు ఢీకొన్నాయి. అయితే, ప్రమాద సమయంలో ఆటోలో ఎవరూ లేకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్