జార్ఖండ్ లో ఘోర రైలు ప్రమాదం జరిగింది. సాహిబ్‌గంజ్ రైల్వే యార్డ్‌లో ట్రాక్ పై ఒక గూడ్స్ రైలు రెండు భాగాలుగా విడిపోయి ఉంది. అయితే అకస్మాత్తుగా ఆ గూడ్స్ రైలులోని ఒక భాగం వేగంగా వచ్చి ట్రాక్‌పై ఉన్న మరొక భాగాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గూడ్స్ రైలు 10 బోగీలు పట్టాలు తప్పాయి. అలాగే కొన్ని బోగీలు ధ్వంసం అయ్యాయి. అయితే ప్రమాద సమయంలో అక్కడ ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.