గోరు చిక్కుడు సాగుకు అనుకూలమైన నేలలివే

65చూసినవారు
గోరు చిక్కుడు సాగుకు అనుకూలమైన నేలలివే
గోరుచిక్కుడు సాగు చేసి రైతులు మంచి లాభాలను పొందవచ్చు. అయితే ఈ పంట సాగుకు 30-35 డిగ్రీల ఉష్ణోగ్రత అవసరం ఉంటుంది. ఇక విత్తనం మొలకెత్తే సమయంలో 30-35 డిగ్రీల ఉష్ణోగ్రత అవసరం ఉంటుంది. కొమ్మలు వచ్చే సమయంలో 32-38 డిగ్రీల ఉష్ణోగ్రత కావాలి. ఉదజని సూచిక 7-8.5 మధ్య ఉండి, మధ్యస్థ, తేలికపాటి నేలలు గోరు చిక్కుడు సాగుకు అనుకూలం. నీటి నిల్వ భూములు, నల్లరేగడి, గాలిలో తేమ ఎక్కువగా ఉండే ప్రాంతాలు అనుకూలంగా ఉండవు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్