వ్యవసాయ మార్కెట్ యార్డు ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్

72చూసినవారు
వ్యవసాయ మార్కెట్ యార్డు ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
TG: ఖమ్మం జిల్లా మతికేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డు ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చజండా ఊపింది. వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చొరవతో మతికేపల్లి మార్కెట్ యార్డు ఏర్పాటు కానుంది. 'ఈ ప్రాంతంలో మార్కెట్ యార్డు సదుపాయం లేకపోవడంతో మొక్కజొన్న, పత్తి, ఇతర పంటను రైతులు ప్రైవేట్ దళారులకు అమ్ముకునేవారు. మార్కెట్ యార్డు ఏర్పాటుతో రైతులు తమ పంటను గిట్టుబాటు ధరకు అమ్ముకునే అవకాశం ఉంటుంది' అని తుమ్మల అభిప్రాయపడ్డారు.

సంబంధిత పోస్ట్