తెలంగాణలో బీర్ల ధరలను సవరిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఒక్కో బీరుపై 15 శాతం పెంచింది. పెంచిన బీర్ల ధరలు మంగళవారం నుంచి అమల్లోకి రానున్నాయి. రిటైర్డ్ జడ్జి జైస్వాల్ కమిటీ సిఫార్సులకు అనుగుణంగా తెలంగాణ ఎక్సైజ్ శాఖ బీర్ల ధరలను పెంచుతూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది.