సామాజిక, ఆర్థిక, కులగణన సర్వే తీర్మానానికి తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. SC వర్గీకరణను తాము అడ్డుకున్నట్టు ప్రభుత్వం తప్పుడు ప్రచారం చేస్తోందని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ఆవేదన వ్యక్తం చేశారు. వర్గీకరణపై కాంగ్రెస్సే పోరాడినట్టు చిత్రీకరిస్తున్నారని మండిపడ్డారు. 2014 నవంబర్ 29న KCR వర్గీకరణపై తీర్మానం పెట్టారని, SC వర్గీకరణపై BRS ప్రభుత్వం తీర్మానం చేసి కేంద్రానికి పంపిందని KTR గుర్తుచేశారు.