కాంగ్రెస్ ప్రభుత్వం కమిటీల పేరుతో సమయం వృథా చేస్తోందని బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి మండిపడ్డారు. హైదరాబాద్‌లో గురువారం ఆయన మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. 'రైతులను ఆదుకునే చర్యలు మాత్రం ఇప్పటి వరకు తీసుకోలేదు. కౌలు రైతులకు రైతు భరోసా ఇస్తామన్నారు.. ఇప్పటి వరకు ఇవ్వలేదు. రైతు కూలీలకు రూ.12 వేలు ఇస్తామన్నారు.. ఇప్పటి వరకు ఇవ్వలేదు' అని ఫైర్ అయ్యారు.