TG: కాళేశ్వరం సరస్వతి పుష్కరాల్లో ప్రభుత్వ దోపిడి చేస్తోందని సన్యాసులు ఆరోపించారు. స్వామివారి దర్శనానికి రూ.100 వసూలు చేశారని, తాము సన్యాసులమన్నా లోనికి విడిచిపెట్టలేదని అన్నారు. మంత్రి కొండా సురేఖ బిజినెస్ చేస్తున్నారా? అంటూ వారు మండిపడ్డారు. ‘రూ.33 కోట్లు పుష్కరాల కోసం ఏర్పాట్లు చేశామని చెప్పారు. ఇక్కడ రెండు టెంట్లు, మట్టి రోడ్డు తప్ప ఏమీ లేవు. సాధారణ ప్రజలకు తగినట్లు టికెట్ ధర నిర్ణయించాలి’ అని సన్యాసులు కోరారు.