సీడ్ కంపెనీలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి: KTR (వీడియో)

72చూసినవారు
TG: గద్వాల జిల్లాలో రైతులను మోసం చేస్తున్న సీడ్ కంపెనీలపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని KTR డిమాండ్ చేశారు. రైతులు పెట్టిన పెట్టుబడి తిరిగి వచ్చేలా కంపెనీలతో చర్చించి తగిన న్యాయం చేయాలన్నారు. సీడ్ కంపెనీల అక్రమాలతో మోసపోయిన గద్వాల జిల్లా రైతులు మంగళవారం HYDలోని నందినగర్‌లో కేటీఆర్‌ను కలిశారు. సీడ్ కంపెనీలు చేసిన మోసంతో ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి దాపురించిందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్