మంత్రికే లంచం ఇవ్వబోయిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు అరెస్ట్

రాజస్థాన్ విద్యాశాఖ మంత్రి మదన్ దిలావర్‌కు లంచం ఇవ్వబోయిన ఓ ఉపాధ్యాయుడు పోలీసుల చేతికి చిక్కాడు. పాఠ్యాంశాల కమిటీలో తనకు సభ్యత్వం కల్పించాలంటూ చంద్రకాంత్ వైష్ణవ్ అనే ప్రభుత్వ ఉపాధ్యాయుడు మంత్రికి స్వీట్ బాక్స్‌తో పాటు రూ.5వేల నోట్ల కవరును ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఈ ఘటనను గమనించిన మంత్రి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఉపాధ్యాయుడిని అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు.