తెలంగాణ ప్రభుత్వం మంగళవారం జరగనున్న శాసనసభ, మండలిలో కీలక ప్రకటన చేయనుంది. సామాజిక, ఆర్ధిక, విద్య, ఉపాధి, రాజకీయ, కులగణనపై రేవంత్ సర్కార్ ప్రకటన చేయనుంది. ఎస్సీ వర్గీకరణపై, ఏకసభ్య కమిషన్ నివేదికపై ప్రకటన తెలంగాణ ప్రభుత్వం చేయనుంది. ఈ మేరకు శాసనసభలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటన చేయనున్నారు. అలాగే మండలిలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకటన చేయనున్నారు.