గజం ప్రభుత్వ భూమి కూడా కబ్జా కావొద్దు: పొంగులేటి

77చూసినవారు
గజం ప్రభుత్వ భూమి కూడా కబ్జా కావొద్దు: పొంగులేటి
తెలంగాణలో రెవెన్యూ ఉద్యోగుల పనితీరు మెరుగుపడాలని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సూచించారు. ఇవాళ రెవెన్యూ ఉద్యోగులతో ఆయన సమావేశమయ్యారు. 'రాష్ట్రంలో గజం ప్రభుత్వ భూమి కూడా కబ్జా కావొద్దు. ఇందులో రాజీ పడొద్దు. ప్రతి గ్రామానికి రెవెన్యూ అధికారిని పునరుద్ధరిస్తాం. దీనికి సంబంధించి ఈ నెల 29న MRO స్థాయి, అక్టోబర్ 6న RDO, అదనపు కలెక్టర్లు, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లతో చర్చిస్తాం' అని అన్నారు.

సంబంధిత పోస్ట్