వీఆర్‌వో, వీఆర్‌ఏలకు మరోసారి జీపీవో అర్హత పరీక్ష: మంత్రి పొంగులేటి

12చూసినవారు
వీఆర్‌వో, వీఆర్‌ఏలకు మరోసారి జీపీవో అర్హత పరీక్ష: మంత్రి పొంగులేటి
TG: ప్రతి రెవెన్యూ గ్రామానికి GPO ఉంటారని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి తెలిపారు. వీఆర్‌వో, వీఆర్‌ఏలుగా పని చేసినవారికి జీపీవోలుగా అవకాశం ఇస్తున్నట్లు చెప్పారు. ప్రత్యేక పరీక్ష ద్వారా 3,454 మంది అర్హత సాధించారని వెల్లడించారు. రెవెన్యూ ఉద్యోగ సంఘాల విజ్ఞప్తి మేరకు వీఆర్‌వో, వీఆర్‌ఏలకు మరో అవకాశం ఇవ్వాలని నిర్ణయించినట్లు పేర్కొన్నారు. అర్హత పరీక్ష త్వరలోనే నిర్వహిస్తామని మంత్రి వెల్లడించారు.

సంబంధిత పోస్ట్