TG: నల్గొండ జిల్లా తిరుమలగిరి పోలీస్ స్టేషన్‌లో హెడ్ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న రమేష్ ఆదివారం డ్యూటీలోనే మృతి చెందాడు. దీంతో రోజు తనతో ఆడుకునే నాన్న ఇక లేడని తెలిసి ఆ కూతురు ఏడ్చిన తీరు అందరినీ కలచివేసింది. 'నాన్న ఒకసారి లే నాన్న.. ఒక్కసారి చూడండి.. మీరే మా ధైర్యం.. ప్లీజ్ నాన్న అంటూ కూతురు రోదించిన తీరు అక్కడి వారందరిని కంటతడి పెట్టించింది.