అర్చక ఉద్యోగులకు గ్రాట్యుటీ రూ.8 లక్షలకు పెంపు

74చూసినవారు
అర్చక ఉద్యోగులకు గ్రాట్యుటీ రూ.8 లక్షలకు పెంపు
TG: దేవాదాయ శాఖ పరిధిలో పని చేస్తున్న అర్చకులు, ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వారికి గ్రాట్యుటీని రూ.4లక్షల నుంచి రూ.8 లక్షలకు పెంచుతూ ఉత్తర్వులు జారి చేసింది. దీంతో 13,700 మంది అర్చకులు, ఇతర ఉద్యోగులకు లబ్ధి చేకూరనుంది. మరోవైపు అర్చక సంక్షేమ నిధి ఏర్పాటు చేస్తూ మంత్రి కొండా సురేఖ పోస్టర్ రిలీజ్ చేశారు. దీంతో పాటు అంతిమ సంస్కారాల ఖర్చులకు ఇచ్చే రూ.20వేలను రూ.30వేలకు పెంచినట్లు మంత్రి తెలిపారు.

సంబంధిత పోస్ట్