గ్రీన్‌ ఫార్మాసిటీ కొనసాగుతుంది: TG ప్రభుత్వం

83చూసినవారు
గ్రీన్‌ ఫార్మాసిటీ కొనసాగుతుంది: TG ప్రభుత్వం
తెలంగాణలో గ్రీన్‌ ఫార్మాసిటీ కొనసాగుతుందని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టతనిచ్చింది. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం మేడిపల్లి వద్ద గ్రీన్‌ ఫార్మాసిటీ ఉంటుందని తెలిపింది. గ్రీన్‌ ఫార్మాసిటీ రద్దు అనే మీడియా కథనాలు వాస్తవం కాదని తేల్చి చెప్పింది. ఈ మేరకు హైకోర్టులో రెవెన్యూశాఖ కార్యదర్శి నవీన్‌ మిత్తల్‌ కౌంటర్‌ దాఖలు చేశారు. రద్దుపై ప్రభుత్వం ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేదని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్