గుండెపోటుతో పెళ్లి బారాత్‌‌లోనే వరుడు మృతి (వీడియో)

52చూసినవారు
దేశంలో గుండెపోటు ఘటనలు కలవరం సృష్టిస్తున్నాయి. పెళ్లి ఊరేగింపు(బారాత్)లో డీజే పాటలకు డాన్స్ చేసి మండపానికి వెళ్లేందుకు గుర్రం ఎక్కిన పెళ్ళికొడుకు ఒక్కసారిగా గుండెపోటుతో మృతిచెందిన ఘటన మధ్యప్రదేశ్‌లోని శియోపూర్ నగరంలో చోటుచేసుకున్నది. బంధువులు, స్నేహితులు సీపీఆర్ చేసినా వరుడు ప్రదీప్ జాట్ (25) మృతిచెందడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలోకి వెళ్లారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

సంబంధిత పోస్ట్