వధువు నుదుటిన సిందూరం పెడుతుండగా వరుడి చేయి వణకడంతో వధువు పెళ్లి క్యాన్సిల్ చేసింది. అతను పిచ్చివాడని, పెళ్లి చేసుకోనని యువతి తేల్చి చెప్పింది. ఈ ఘటన బిహార్ కైమూర్ (D)లో చోటు చేసుకుంది. తామిచ్చిన రూ.లక్ష కట్నం డబ్బులు తిరిగివ్వాలని వధువు తండ్రి కోరగా ఖర్చయిపోయాయని, ఇవ్వలేమని వరుడి ఫ్యామిలీ చెప్పింది. ఈ పంచాయితీ పోలీస్ స్టేషన్‌కు చేరగా, అక్కడా ఇదే సీన్ రిపీటయింది. చేసేదేమీ లేక ఎవరి ఇళ్లకు వారు వెళ్లిపోయారు.