శ్రీలంక- ఆస్ట్రేలియా మధ్య గాలె వేదికగా బుధవారం తొలిటెస్టు ఆరంభమైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్‌గా వచ్చిన ట్రవిస్ హెడ్ లంక బౌలర్లపై విరుచుకు పడ్డాడు. 35 బంతుల్లోనే యాబై పరుగుల మార్కు అందుకున్నాడు. 57 (40 బంతుల్లో 10 ఫోర్స్, 1 సిక్సర్) పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద అవుటయ్యాడు. హెడ్ ఇప్పటి నుంచే ఐపీఎల్ మోడ్‌లోకి వెళ్లిపోయాడంటూ SRH ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.