ఇస్రో తన 100వ మిషన్ అయిన ఎన్‌వీఎస్-02 నావిగేషన్ శాటిలైట్‌ను విజయవంతంగా ప్రయోగించింది. ఉదయం 6.23 గంటలకు తిరుపతి జిల్లా శ్రీహరికోట నుంచి జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్ 15 ద్వారా ఈ రాకెట్‌ను నింగిలోకి పంపింది. భారతదేశ నావిగేషన్ వ్యవస్థను విస్తరించడంలో ఈ ఉపగ్రహం కీలక పాత్ర పోషించనుంది. ఇస్రో ఛైర్మన్ నారాయణన్ నేతృత్వంలో చేపట్టిన తొలి మిషన్ ఇదే.