ఉత్తరాఖండ్‌లోని రిషికేశ్‌లో ఇటీవల జరిగిన ఓ రెస్క్యూ ఆపరేషన్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రివర్ రాఫ్టింగ్‌కు కొందరు పర్యాటకులు వెళ్లారు. నది మధ్యలో ఓ పర్యాటకుడు బోట్ నుంచి నీళ్లలో పడిపోయాడు. ఆ సమయంలో మునిగిపోతున్న వ్యక్తిని కాపాడడానికి రాఫ్టింగ్ గైడ్ ప్రాణాలకు తెగించి నదిలో దూకాడు. పర్యాటకుడిని సురక్షితంగా కాపాడి బోట్‌లోకి చేర్చాడు. ఇది ఎప్పుడు, ఎక్కడ జరిగిందో స్పష్టత లేదు.