హైదరాబాద్ గుల్జార్ హౌస్‌లో జరిగిన అగ్నిప్రమాదంపై సమగ్ర విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఆరుగురు ఉన్నతాధికారులతో కమిటీని ఏర్పాటు చేసింది. GHMC కమిషనర్ RV కర్ణన్, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, CP సీవీ ఆనంద్, ఫైర్ డీజీ నాగిరెడ్డి, హైడ్రా కమిషనర్ రంగనాథ్, TSSPDCL CMD ముషారఫ్‌లు ఈ కమిటీ సభ్యులని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. ఈ సంఘటనపై క్షేత్ర స్థాయిలో విచారణ జరిపి CMకి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.