ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య కీలకమైన నల్లపాడు-బీబీనగర్ రెండో రైల్వే లైను నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ఏడాదికి రూ.452.36 కోట్లు కేటాయించింది. మొత్తం పనులు ఐదేళ్లలో 6 దశల్లో పూర్తి చేయాలని అధికారులు నిర్ణయించారు. పనులు పూర్తయిన మార్గాన్ని వెంటనే వినియోగించుకునే విధంగా ప్రణాళికలు రచిస్తున్నారు. ఈ ప్రాజెక్టు పనులు పూర్తయితే గుంటూరు- సికింద్రాబాద్ కేవలం 3 గంటల్లోనే చేరుకోవచ్చు.