TG: మహాత్మా జ్యోతిబాఫూలే బీసీ గురుకుల పాఠశాలల్లో 2025- 26 విద్యా సంవత్సరానికి 6, 7, 8, 9వ తరగతుల్లో బ్యాక్లాగ్ సీట్ల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. 6,835 సీట్లకు గానూ ఈ నెల 20న రాష్ట్ర వ్యాప్తంగా ఎంట్రన్స్ ఎగ్జామ్ జరగనుంది. ఈ పరీక్షకు సంబంధించిన హాల్ టికెట్లు నేటి నుంచి అందుబాటులో ఉండనున్నాయి. www.mjptbcwreis.telangana.gov.in లేదా https://mjptbcadmissions.org వెబ్ సైట్ల నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు.