హనుమాన్ సర్వ జగత్ రక్షకుడు: హరీశ్ రావు

56చూసినవారు
హనుమాన్ సర్వ జగత్ రక్షకుడు: హరీశ్ రావు
హనుమాన్ జయంతి సందర్బంగా సిద్దిపేటలో రామ రాజు రావి చెట్టు హనుమాన్ దేవాలయంలో శనివారం జరిగిన హనుమాన్ మాలధారణ స్వాముల బిక్షా కార్యక్రమంలో BRS మాజీ మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. ఆలయంలో ఏర్పాటు చేసిన పల్లకి సేవలో పాల్గొని అనంతరం ఆలయంలో ఆంజనేయ స్వామిని దర్శించుకొని పూజలు నిర్వహించారు. శ్రీ రాముడు ఆంజనేయున్ని మేచ్చుకొని సన్మానం చేసిన రోజు హనుమాన్ విజయోత్సవం అని అన్నారు. హనుమాన్ సర్వ జగత్ రక్షకుడని చెప్పారు.

సంబంధిత పోస్ట్