TG: గౌలిగూడలోని శ్రీరామ మందిరం నుంచి హనుమాన్ శోభాయాత్ర ప్రారంభమైంది. కోఠి, నారాయణగూడ బైపాస్ మీదుగా సికింద్రాబాద్‌లోని తాడ్‌బండ్ హనుమాన్ ఆలయం వరకు దాదాపు 12 కిలోమీటర్ల మేర ఈ ర్యాలీ సాగనుంది. శోభాయాత్రకు భక్తులు భారీగా తరలివచ్చి పాల్గొన్నారు. పోలీస్ శాఖ బందోబస్తు ఏర్పాటు చేసింది. సీసీ కెమెరాలు, డ్రోన్లతో అడుగడుగునా నిఘా ఏర్పాటు చేసింది.