నందమూరి బాలకృష్ణకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా పోస్ట్ పెట్టారు. 'తెలుగు సినీ నటులు, హిందూపురం శాసనసభ్యులు, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు, బసవ తారకం క్యాన్సర్ ఆసుపత్రి చైర్మన్ నందమూరి బాలకృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు. వెండితెర కథానాయకునిగా కోట్లాది అభిమానులను పొందిన మీరు... నిండు నూరేళ్లూ ఆరోగ్య ఆనందాలతో వర్ధిల్లాలని మనసారా కోరుకుంటున్నాను' అంటూ చంద్రబాబు పేర్కొన్నారు.