
జనసేనలోకి వైసీపీ మాజీ ఎమ్మెల్యే మానుగుంట!
AP: వైసీపీ నుంచి మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనలో చేరిన విషయం తెలిసిందే. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వైసీపీ అసంతృప్త నేతలతో బాలినేని మంతనాలు సాగిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో కందుకూరు వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి వైసీపీకి గుడ్ బై చెప్పి జనసేనలో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారట. గత ఎన్నికల్లో వైసీపీ టికెట్ ఇవ్వకపోవడంతో మానుగుంట తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారట.