హ్యాపీ మదర్స్ డే

571చూసినవారు
హ్యాపీ మదర్స్ డే
ఈ సృష్టిలో స్వచ్ఛమైన ప్రేమ పంచేది అమ్మ. అమ్మ పునర్జన్మనెత్తుతూ బిడ్డకు జన్మనిస్తుంది. తన పొత్తిళ్ళలో పసికందును చూసి ప్రసవవేదనను మరిచిపోతుంది. మన ఇష్టాల కోసం అమ్మ తన ఇష్టాలను త్యాగం చేస్తుంది. మన ఆనందాన్నే తన ఆనందంగా భావిస్తుంది. కుటుంబం కోసం అమ్మ చూపించే ప్రేమ, శ్రద్ధా, త్యాగం ఎనలేనివి. అలాంటి అమ్మ కోసం ప్రత్యేకంగా కేటాయించిన ఈరోజున తనతో సమయం గడిపి మాతృదినోత్సం జరుపుకుందాం.

సంబంధిత పోస్ట్