
త్వరలోనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్న్యూస్?
జులై నెలలోనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2025 కరువు భత్యం (DA) పెరిగే ఛాన్స్ ఉన్నట్లు కొన్ని సంస్థలు అంచనా వేస్తున్నాయి. ద్రవ్యోల్బణ గణాంకాల ప్రకారం 55% డీఏను 59శాతానికి పెంచనున్నట్లు సమాచారం. జులై నుంచే ఈ పెంపు అమల్లోకి రానుండగా, బకాయిలు మాత్రం JAN 1, 2026 తర్వాతే చెల్లిస్తారని తెలుస్తోంది. ఇందుకు సంబంధించి రానున్న 2 నెలల్లో అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ప్రభుత్వ ఉద్యోగులకు ఏటా 2 సార్లు జనవరి, జులైలో డీఏను సవరిస్తారు.