
పెళ్లైన మూడు నెలలకే నవ వధువు ఆత్మహత్య
TG: నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలో విషాద ఘటన చోటు చేసుకుంది. పెళ్లైన 3 నెలలకే నవ వధువు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పాత ఎల్లపూర్ గ్రామానికి చెందిన శైలజ (20)ను అదే గ్రామానికి చెందిన అల్లెపు రాజేష్ ను వివాహం చేసుకుంది. అయితే భర్త రాజేష్, అత్త లక్ష్మి వరకట్నం కోసం వేధిస్తున్నారని శైలజ తన తల్లిదండ్రులకు వివరించిందని బంధువులు తెలిపారు. మృతురాలు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.