

SHOCKING VIDEO: 8 ఏళ్ల బాలుడిని నేలకేసి కొట్టాడు
యూపీలోని బల్లియా జిల్లాలో దారుణ ఘటన జరిగింది. రాస్రా పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని ఓ యువకుడు 8 ఏళ్ళ బాలుడిని ఒక్కసారిగా అమాంతం పైకి లేపి నేలకేసి కొట్టాడు. అది గమనించిన స్థానికులు వెంటనే పిల్లాడిని సమీప ఆసుపత్రికి తరలించారు. చిన్నారి మెదడులో 6 చోట్ల తల పగిలి, 8 చోట్ల చోట్లరక్తం గడ్డకట్టిందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం, చిన్నారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.