భూభారతిని ఆవిష్కరించుకోవడం సంతోషంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. 'భూభారతి' పోర్టల్ ప్రారంభోత్సవం సందర్భంగా సోమవారం శిల్పకళావేదికలో సీఎం మాట్లాడారు. "పండుగ వాతావరణంలో భూభారతిని ప్రజలకు అంకితం చేస్తున్నాం. అగ్రికల్చర్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి దళితులకు, గిరిజనులకు కాంగ్రెస్ భూములు పంచింది. భూమి కోసం గతంలో ఎన్నో ఉద్యమాలు జరిగాయి. పోరాటాల నుంచి రెవెన్యూ చట్టాలు వచ్చాయి." అని సీఎం రేవంత్ అన్నారు.