అంబులెన్స్‌లో మహిళపై వేధింపులు.. ఆక్సిజన్ అందక భర్త మృతి

58చూసినవారు
అంబులెన్స్‌లో మహిళపై వేధింపులు.. ఆక్సిజన్ అందక భర్త మృతి
ఉత్తరప్రదేశ్‌లోని ఘాజీపూర్‌లో దారుణం జరిగింది. సిద్ధార్థనగర్ కు చెందిన మహిళ ఇటీవల తన భర్తను ఒక ప్రైవేటు ఆసుపత్రిలో అడ్మిట్ చేసింది. ఖర్చులు భరించలేక భర్తను తీసుకుని ప్రైవేట్ అంబులెన్స్‌లో ఇంటికి బయలుదేరింది. ఈ క్రమంలో ముందు సీట్లో కూర్చొన్న మహిళపై అంబులెన్స్ డ్రైవర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. మహిళ నిరాకరించడంతో వారిని రోడ్డుపై దించేసి వెళ్లారు. ఈ క్రమంలో భర్తకు ఆక్సిజన్ అందక మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితులను అరెస్ట్ చేశారు.

సంబంధిత పోస్ట్