రేవంత్ ప్రభుత్వానికి హరీశ్ రావు సవాల్ (VIDEO)

57చూసినవారు
TG: రుణమాఫీ విషయంలో రేవంత్ సర్కార్‌కు BRS నేత హరీశ్ రావు సవాల్ విసిరారు. ఏ గ్రామంలో పూర్తి రుణమాఫీ జరిగిందో చెప్పాలని డిమాండ్ చేశారు. పంటల బీమా చెల్లిస్తామని చెప్పి ప్రభుత్వం మొండి చేయి చూపించిందన్నారు. సిద్దిపేట (D) చిన్నకోడూరు మండలంలో రుణమాఫీ జరిగిన రైతులు 5,300 మంది ఉంటే, ఇంకా 7,352 మందికి రుణమాఫీ జరగలేదన్నారు. చెట్లు నరికే రేవంత్ రెడ్డి.. చెట్లు పెట్టే రామయ్యకు సంతాపం చెప్పడం అంటే హంతకుడే సంతాపం తెలిపినట్టుందని విమర్శించారు.

సంబంధిత పోస్ట్