కొణతం దిలీప్ అరెస్ట్‌ను ఖండించిన హరీశ్ రావు

66చూసినవారు
కొణతం దిలీప్ అరెస్ట్‌ను ఖండించిన హరీశ్ రావు
బీఆర్ఎస్ సోషల్ మీడియా నాయకులు కొణతం దిలీప్ అరెస్ట్‌ను మాజీ మంత్రి హరీశ్ రావు ఖండించారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నందుకే ఇలాంటి కక్షపూరిత చర్యలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. హైకోర్టు ఆదేశాలను సైతం బేఖాతరు చేస్తూ కొణతం దిలీప్‌ను అరెస్ట్ చేశారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అప్రజాస్వామిక విధానాలను అనుసరిస్తోందన్నారు. కొణతం దిలీప్‌ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్