వర్షాలకు నష్ట పోయిన పంటలను పరిశీలించిన హరీష్ రావు

59చూసినవారు
TG: అకాల వర్షాలకు నష్టపోయిన పంటలను మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు పరిశీలించారు. సిద్దిపేట జిల్లా నంగునూర్ మండలం రాజ్ గోపాల్ పేట్ గ్రామంలో పర్యటించారు. ఇటీవల కురిసిన వడగండ్ల వర్షాలు, ఈదురుగాలులకు నష్ట పోయిన పంట పొలాలను పరిశీలించి రైతులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. నష్టపోయిన రైతులకు ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం అందజేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్