TG: కాళేశ్వరం కమిషన్ విచారణ అనంతరం మాజీ మంత్రి హరీశ్ రావు మాజీ సీఎం కేసీఆర్‌తో భేటీ అయిన సంగతి తెలిసిందే. అయితే హరీశ్ రావు ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి తిరుగు ప్రయాణమయ్యారు. దాదాపు 5 గంటల పాటు కేసీఆర్‌తో చర్చలు జరిపారు. కాళేశ్వరం కమిషన్ అడిగిన ప్రశ్నలపై కేసీఆర్‌కు వివరించినట్లు సమాచారం. ఇక బుధవారం కాళేశ్వరం కమిషన్ విచారణకు మాజీ సీఎం కేసీఆర్ హాజరు కానున్నారు.