ఈ నెల 28 దాకా హరీశ్‌రావును అరెస్టు చేయొద్దు

71చూసినవారు
ఈ నెల 28 దాకా హరీశ్‌రావును అరెస్టు చేయొద్దు
TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీశ్‌రావును అరెస్టు చేయొద్దన్న మధ్యంతర ఉత్తర్వులను హైకోర్టు ఈ నెల 28 వరకు పొడిగించింది. హరీశ్ తన ఫోన్ ట్యాపింగ్ చేసి బెదిరించారని చక్రధర్ అనే వ్యక్తి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసును క్వాష్ చేయాలని మాజీ మంత్రి హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై మరోసారి విచారణ జరిపిన కోర్టు పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని చక్రధర్ కు నోటీసులు జారీచేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్