మోసం చేసిన కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలి: హరీశ్‌రావు

75చూసినవారు
మోసం చేసిన కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలి: హరీశ్‌రావు
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కరోనా కష్టకాలంలోనూ రైతుబంధు ఇచ్చినట్లు మాజీ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. కరీంనగర్‌ ఎంపీ అభ్యర్థి వినోద్‌కుమార్‌కు మద్దతుగా భీమదేవరపల్లిలో ప్రచారం చేసి మాట్లాడారు. 'రైతుబంధు ద్వారా 11 విడతల్లో రైతులకు రూ.72 వేల కోట్లు ఇచ్చాము. సీఎం రేవంత్‌రెడ్డి చెప్పేవన్నీ అబద్ధాలు. ఎక్కడికిపోతే అక్కడ దేవుళ్లపై ఒట్లు పెడుతున్నారు. మోసం చేసిన కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పాలి. పదవి కంటే ప్రజల సంతోషమే నాకు ముఖ్యం' అని అన్నారు.

సంబంధిత పోస్ట్