TG: భూములు, మద్యం అమ్మకం, అప్పులు తెచ్చి ప్రభుత్వాలను నడుపుతున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. అర్ధరాత్రి ఫ్లడ్ లైట్స్ పెట్టి చెట్లను నరికిన ప్రభుత్వాలను ఎప్పుడైనా చూశామా అని ఎద్దేవా చేశారు. హెచ్‌సీయూలో జింకలు, నెమళ్లు ఉన్నవి వాస్తవం అని తెలిపారు. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి ఎన్నికకు తొందరేమీ లేదన్నారు. కానీ, తెలంగాణలో అధికారంలోకి రావాలని కోరుకుంటున్నామని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు.