రోబో సినిమాలో చిట్టి డ్యాన్స్ మాయాజాలం అయినా, ఇప్పుడు టెస్లా రూపొందించిన ‘ఆప్టిమస్ రోబో’ నిజంగానే స్టెప్పులేస్తూ ఆకట్టుకుంటోంది. ఎలాన్ మస్క్ దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. తన శరీరాన్ని బ్యాలెన్స్ చేసుకుంటూ, చక్కగా డ్యాన్స్ చేస్తూ ఆ రోబో చూపరులను ఆశ్చర్యపరుస్తోంది. అంత ఉన్నత సాంకేతికతను రూపొందించడం మస్క్‌కే సాధ్యమని ఈ వీడియో చూసిన నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.